సెల్ఫీ సరదా కొంపముంచింది.. రెండు బోగీలతో పాటు ఆహుతైన బాలుడు...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 17, 2020, 11:54 AM IST
సెల్ఫీ సరదా కొంపముంచింది.. రెండు బోగీలతో పాటు ఆహుతైన బాలుడు...

సారాంశం

ట్రైన్ మీద ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనే ఓ యువకుడి సరదా అతనితో పాటు రెండు బోగీలనూ నిలువుగా కాల్చేసింది. ఒడిస్సాలో జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ట్రైన్ మీద ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనే ఓ యువకుడి సరదా అతనితో పాటు రెండు బోగీలనూ నిలువుగా కాల్చేసింది. ఒడిస్సాలో జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెడితే.. ఒడిస్సా పర్లాకిమిడి స్థానిక రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆగి ఉన్న పాసింజర్‌ రైలులోని 2 బోగీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. 

దీంతో కొద్దిరోజుల క్రితం పాసింజర్‌ రైలును స్థానిక స్టేషన్‌లో ఆపేశారు. బోగీలు, ఇంజిన్‌ వేరుచేసి, పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్‌ లైన్‌ను సరి చేస్తున్నారు. అయితే అటుగా వచ్చిన పర్లాకిమిడిలోని గౌరచంద్ర వీధికి చెందిన సూర్యకుమార్‌ ఎలక్ట్రిక్‌ ట్రైను బోగి ఎక్కి, సెల్‌ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ లైన్‌ను పట్టుకున్నాడు. 

బోగీలపై అప్పటికే గోనె సంచులు కప్పి ఉండడంతో సూర్యకుమార్ తో పాటు గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. జీఆర్‌పీ పోలీసులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందికి దించారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?