విషాదం: రైలుపై నిలబడి సెల్పీ దిగుతుండగా యువకుడి సజీవ దహనం

Published : Dec 17, 2020, 10:21 AM IST
విషాదం: రైలుపై నిలబడి సెల్పీ దిగుతుండగా యువకుడి సజీవ దహనం

సారాంశం

సెల్ఫీ సరదా  14 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది.  ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి  రైల్వే స్టేషన్ లో  ఈ ఘటన చోటు చేసుకొంది.


భువనేశ్వర్: సెల్ఫీ సరదా  14 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది.  ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి  రైల్వే స్టేషన్ లో  ఈ ఘటన చోటు చేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో రైలు పై భాగంలో నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

14 ఏళ్ల యువకుడు  రైలు బోగీపై నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో  హైటెన్షన్ వైర్ తగిలి రెండు రైల్వే బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు  మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

ఈ సమయంలో  రెండు బోగీలు దగ్ధమైన ఘటనలో  రైల్వే ట్రాక్ వద్ద ఉన్న మృతుడి ఇద్దరు మిత్రులు  కూడ స్వల్పంగా గాయపడ్డారు.

ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు డివిజన్ రైల్వే మేనేజర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా స్పెషల్ ట్రైన్ గత కొన్ని రోజులుగా గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో నిలిచింది.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?