యూపీలో ఘోర ప్రమాదం 13 మంది మృతి: 31 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Feb 13, 2020, 7:01 AM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నాగ్లాఖాంగార్ లో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు.

ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై బుధవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఢిల్లీ నుండి బీహార్ లోని మోతిహరికి బస్సు వెళ్తోంది. బస్సు నాగ్లాఖాంగార్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని  సీఎం ఆదేశించారు.

Also read:కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి


ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

Firozabad: At least 14 feared dead & many injured after a bus collided with a truck on the Agra-Lucknow Expressway in Bhadan, yesterday late night. Sachindra Patel, SSP say,"there were at least 40-45 passengers in the bus. Injured have been shifted to Saifai Mini PGI." pic.twitter.com/HrmNSZGHAl

— ANI UP (@ANINewsUP)
click me!