గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. విచారణ అధికారులకు వై కేటగిరీ భద్రత ..

By Rajesh KarampooriFirst Published Dec 14, 2022, 2:34 PM IST
Highlights

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసును ఛేదించడంలో పాల్గొన్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని 12 మంది అధికారులను అమెరికాలో తలదాచుకున్న గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండా బెదిరించాడు. దీంతో వారికి భద్రతను కట్టుదిట్టం చేశారు. వీరిలో ముగ్గురు అధికారులకు వై కేటగిరీ భద్రత కల్పించారు.

సిద్ధూ మూసేవాలా హత్య కేసు: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని 12 మంది అధికారులకు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల తర్వాత అధికారులు భద్రతను పెంచారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా బెదిరింపు తర్వాత.. స్పెషల్ సెల్ అధికారులకు భద్రత కల్పించారు.\

వీరిలో స్పెషల్ సీపీ హెచ్‌జీఎస్ ధలివాల్, డీసీపీ రాజీవ్ రంజన్, మనీషి చంద్ర, ఏసీపీ లలిత్ మోహన్ నేగి, హృదయ్ భూషణ్, వేద్ ప్రకాశ్, రాహుల్ విక్రమ్, ఇన్‌స్పెక్టర్ విక్రమ్ దహియా, వినోద్ కుమార్, రవీంద్ర జోషి, నిశాంత్ దహియా, సునీల్ కుమార్ రాజన్ ఉన్నారు. ప్రత్యేక సీపీ హెచ్.ఎస్. ధాలివాల్, డీసీపీ స్పెషల్ సెల్ మనీషి చంద్ర, డీసీపీ రాజీవ్ రంజన్‌లకు వై కేటగిరీ భద్రతను మంజూరు చేశారు.

ఎవరు కాపాడతారో చూద్దాం... 

స్పెషల్ సీపీ, డీసీపీలిద్దరికీ వై కేటగిరీ భద్రత కల్పించగా, ఇతర అధికారులతో పాటు ఒక పీఎస్‌ఓ 24 గంటలూ ఉంటారు. వాస్తవానికి.. పంజాబ్ గ్యాంగ్‌స్టర్ హర్విందర్ రిండా సహచరుడు లఖ్బీర్ సింగ్ లాండా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా అధికారులను బెదిరించాడు. మా దగ్గర అందరి ఫోటోలు వున్నాయి అని ఒక్క మాట చెప్తా... మన వీధుల్లో కనిపిస్తే మంచిదే, కనపడకపోతే మీ వీధుల్లోకి చొరబడి చంపేస్తారు... ఎవరు కాపాడతారో ఇప్పుడు చూద్దాం' అని బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డారు. సిద్ధూ ముసేవాలా హత్య తర్వాత లాండా పరారీలో ఉన్నాడు. ఎవరైనా అధికారి పంజాబ్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్యాంగ్‌స్టర్ బెదిరించాడు. అదే సమయంలో.. ఈ బెదిరింపు తర్వాత, వారు స్పెషల్ సెల్ అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చని నమ్ము, దీని కారణంగా వారి భద్రతను పెంచారు.

click me!