ఏడుగురి హత్య, కోర్టు ఉరిశిక్ష : తల్లి కోసం 12 ఏళ్ల కొడుకు తాపత్రం.. రాష్ట్రపతికి పిటిషన్

Siva Kodati |  
Published : Feb 20, 2021, 04:07 PM ISTUpdated : Feb 20, 2021, 04:08 PM IST
ఏడుగురి హత్య, కోర్టు ఉరిశిక్ష : తల్లి కోసం 12 ఏళ్ల కొడుకు తాపత్రం.. రాష్ట్రపతికి పిటిషన్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన షబ్నమ్‌ను ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. అయితే తల్లిని రక్షించుకునేందుకు షబ్నమ్‌ కుమారుడు మహ్మద్ తాజ్ రంగంలోకి దిగాడు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన షబ్నమ్‌ను ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. అయితే తల్లిని రక్షించుకునేందుకు షబ్నమ్‌ కుమారుడు మహ్మద్ తాజ్ రంగంలోకి దిగాడు.

తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు. రామ్‌పుర్‌ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న మహ్మద్‌ తాజ్‌.. భావోద్వేగానికి లోనయ్యాడు.

అయితే షబ్నమ్‌ కేసులో యూపీ గవర్నర్‌ అనందిబెన్‌ పటేల్‌ ఇప్పటికే క్షమాభిక్షను తిరస్కరించారు. కానీ శుక్రవారం మరోసారి గవర్నర్‌ ముందుకు ఈ పిటిషన్‌ వచ్చింది.

ఈ సారి కూడా గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరిస్తే..  ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్‌ జల్లానే షబ్నమ్‌నూ ఉరి తీసే అవకాశం ఉంది.  

షబ్నమ్‌ 2008లో ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపింది. దీంతో వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ సమయంలతో షబ్నమ్ గర్భవతి. ఈ కేసుకు సంబంధించి జైలులో ఉండగానే షబ్నమ్‌ మహ్మద్ తాజ్‌కు జన్మనిచ్చింది.

జైలు నిబంధనల ప్రకారం పిల్లవాడికి ఆరేళ్ల వయసు వచ్చిన తరువాత అక్కడ ఉండకూడదు. దీంతో షబ్నమ్‌... తన మిత్రుడైన ఉస్మాన్‌ సైఫీకి తాజ్‌ సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి తాజ్‌కు సంబంధించిన అన్నీ వ్యవహారాలను సైఫీ చూసుకునేవారు.  

PREV
click me!

Recommended Stories

Jobs : రంగాల వారీగా టార్గెట్స్ ఫిక్స్... ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
Bank Holidays : అయ్యబాబోయ్.. ఈ నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఓసారి ఈ లిస్ట్ చూసుకోండి