ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం.. 12 మంది మృతి..

By team teluguFirst Published Oct 31, 2021, 11:56 AM IST
Highlights


ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా.. మరో నలుగురు గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. 

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి లోయలో (vehicle falls into gorge) పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా.. మరో నలుగురు గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారితో కలిసి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. అయితే కొండ ప్రాంతం  కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది.

ఈ ప్రమాదం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న చక్రతా తహసీల్‌లోని టీయూని అనే మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. బుల్హాద్-బైలా రహదారిపై ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఉత్తరాఖండ్‌లోని చక్రతా ప్రాంతంలో బైలా గ్రామం నుంచి వికాస్‌నగర్ వెళ్తున్న వాహనం..  బుల్హాద్-బైలా రహదారిపై అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 19 మంది ఉన్నట్టుగా సమాచారం.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ ఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. కారు టైరు పేలి, నలుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండో సారి. బుధవారం రోజున కారు మరో వాహనాన్ని ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఆ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. 
 

click me!