అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం, 12మంది మృతి, 30 మందికి గాయాలు..

By SumaBala Bukka  |  First Published Jan 3, 2024, 10:58 AM IST

అసోంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో రావడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. 



అసోం : బుధవారం ఉదయం అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 12 మంది మృతి చెందగా, 30మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేన్ సింగ్ తెలిపారు.
బస్సు గోలాఘాట్ జిల్లాలోని కమర్‌బంధ ప్రాంతం నుండి తిలింగ మందిర్ వైపు వెళుతోంది. బలిజన్ ప్రాంతంలో బస్సు ట్రక్కును ఢీకొట్టింది. జోర్హాట్ వైపు నుండి ట్రక్కు రాంగ్ రూట్ లో వస్తోంది. 

Latest Videos

undefined

హిట్ అండ్ రన్ కొత్త చట్టం ఏమిటి? డ్రైవర్ల ఆందోళనకు కారణమేంటి? పెట్రోల్ బంకులకు దీనికి ఏం సంబంధం?

దీంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం నుంచి 10 మృతదేహాలను వెలికితీసి డెర్గావ్ సీహెచ్‌సీకి తరలించారు. గాయపడిన 27 మందిని జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు, అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించారు”అని రాజేన్ సింగ్ చెప్పారు.

ఈ ఘటనతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మరణించారని గోలాఘాట్ జిల్లా ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని రాజేన్ సింగ్ చెప్పారు.

click me!