
భోపాల్ : దేశవ్యాప్తంగా మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రతిఘటిస్తే చాలు.. భౌతిక దాడులకు దిగుతూ.. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కలకలం రేగింది. Madhya Pradeshలోని భోపాల్ లో దారుణం చోటుచేసుకుంది. Sexual harassmentను ప్రతిఘటించిన ఓ మహిళపై నిందితులు Paper cutterతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయింది. Surgery క్రమంలో ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయని స్థానిక పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెడితే.. ఆదివారం వారు కేసు వివరాలను వెల్లడించారు. ఆ మహిళ శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక హోటల్ కు వెళ్లింది. బైక్ పార్కింగ్ విషయంలో అక్కడ ఆమెకు ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో భర్త హోటల్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే వారు ఆమె పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అమర్యాదకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ వారిని ధైర్యంగా ఎదిరించింది. ముగ్గురిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టింది అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ దంపతులు హోటల్ నుంచి బయటకు రాగానే... అప్పటికే ఆగ్రహంతో ఉన్న నిందితుడు పేపర్ కట్టర్ తో ఆమెపై దాడికి పాల్పడ్డారు.
తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయానని కుమారుడి ఆత్మహత్య.. ఎక్కడంటే ?
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు.. బాద్షా బేగ్, అజయ్ అలియాస్ బిట్టి సిబ్దేలను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం బాధితురాలు ఇంటికి చేరుకుని పరామర్శించారు, ఆమె వైద్యానికి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ రూ. లక్ష సాయం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.