ఉమెన్స్ హాస్టల్ లో కండోమ్ ప్యాకెట్లు, మద్యం బాటిల్లు

First Published Aug 2, 2018, 3:21 PM IST
Highlights

మత్తుమందులు, నిద్రమాత్రలు ఇచ్చి రేప్‌ చేసేవారు. ఎవరైనా ఆ మాత్రలు తీసుకోకుంటే తీవ్రంగా కొట్టేవారు. సలసల కాగే నీళ్లు వారి మీద కుమ్మరించేవారు. బాలికల శరీరాంగాలపై గాట్లు పెట్టేవారు.

బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ రాష్ట్రంలోని ఉమెన్స్ హాస్టల్ కి సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సేవా సంకల్ప్‌ ఏవం వికాస్‌ సమితి అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహిస్తున్న ఆ వసతిగృహంలో 40 మంది బాలికలపై సమితి యజమాని బ్రజేశ్‌ ఠాకూర్‌తో పాటు మరో 10 మంది సిబ్బంది నెలల తరబడి లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు అభియోగం మోపారు. వీరు కాక.. మరో 11 మంది యువతులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

బాధిత యువతులంతా.. 15 నుంచి 17ఏళ్లలోపు వారు కావడం గమనార్హం.  వారంతా గ్రామీణ ప్రాంత పిల్లలు. ప్రభుత్వ వసతిగృహం కదా.. అని నమ్మకంతో తలిదండ్రులు వారిని చదువు కోసమని చేర్పిస్తే కామాంధులు కాటేశారు. ‘‘మత్తుమందులు, నిద్రమాత్రలు ఇచ్చి రేప్‌ చేసేవారు. ఎవరైనా ఆ మాత్రలు తీసుకోకుంటే తీవ్రంగా కొట్టేవారు. సలసల కాగే నీళ్లు వారి మీద కుమ్మరించేవారు. బాలికల శరీరాంగాలపై గాట్లు పెట్టేవారు.’’అని విచారణలో తేలింది.
 
‘‘ఆ వసతి గృహ సంరక్షకురాలు కిరణ్‌ ఆంటీ ఏం చెబితే అది చేసి తీరాల్సిందే. ఆమె రాత్రంతా పిల్లలను నగ్నంగా పడుకోమనేది. ఆమె కూడా నగ్నంగానే పడుకొనేది. అక్కడికొచ్చిన బ్రజేశ్‌, అతని స్నేహితుల వద్దకు తానే బలవంతంగా రూముల్లోకి పంపేది. ఒక బాలిక గర్భం దాల్చినపుడు కిరణ్‌ ఆంటీ ఆ పిల్లను బలంగా గోడకేసి తోసేసిందని, వెంటనే ఆ పిల్లకు అబార్షన్‌ అయిందని పిల్లలు చెప్పారు. ఆ వసతిగృహం సమీపానే కొంతమంది బాలికలను చంపేశారు’’ అని పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

మరిన్ని ఆధారాల కోసం వసతి గృహంలో తనిఖీలు నిర్వహించగా.. వారికి హాస్టల్ లో కుప్పలు కుప్పలుగా కండోమ్ ప్యాకెట్లు, ఖాళీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. చాలా మంది బాలికలు గర్భం దాల్చగా... వారికి అబార్షన్లు కూడా చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

click me!