దీదీకి షా మాస్టర్ స్ట్రోక్: బీజేపీ గూటికి 11 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు

By Siva KodatiFirst Published Dec 19, 2020, 6:02 PM IST
Highlights

ప‌శ్చిమ‌ బెంగాల్‌ అధ్యక్ష ఎన్నికల వేళ అక్కడి అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల‌ టీఎంసీకి రాజీనామా చేసిన ఆ పార్టీ కీల‌క‌ నేత సువేందు అధికారి.. త‌న‌తోపాటు మ‌రో 10 మంది తృణమూల్ ఎమ్మెల్యేల‌ను పట్టుకెళ్లాడు. 

సువేందు వెంట మ‌హా అయితే మ‌రో ముగ్గురు, న‌లుగురు ఎమ్మెల్యేలు వెళ్తార‌ని తృణ‌మూల్ ముందుగానే ఊహించింది. కానీ సువేంద్ గట్టి స్ట్రోక్ ఇచ్చారు. ఏకంగా ఆయనతో సహా 11 మంది టీఎంసీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఇవాళ బెంగాల్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన వారిలో సువేందు అధికారి, తాప‌సి మొండ‌ల్‌, అశోక్ దిండా, సుదీప్ ముఖ‌ర్జి, సైక‌త్ పంజా, షిభ‌ద్ర ద‌త్త‌, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామ‌ప్ద ముఖ‌ర్జి, విశ్వ‌జిత్ కుందు, బ‌న‌శ్రీ మైతీ ఉన్నారు.

వారితోపాటు ప‌ర్బ బుర్ద్వాన్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎంపీ సునీల్ మొండ‌ల్‌, మాజీ ఎంపీ ద‌శ‌ర‌థ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో దీదీ డిఫెన్స్‌లో పడ్డారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీ.. తృణమూల్‌లోని పెద్ద తలకాయలను టార్గెట్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

click me!