షెల్టర్ హోమ్ ఘాతుకాలు: 11 మంది అమ్మాయిలను చంపేశారు

By telugu teamFirst Published May 4, 2019, 11:10 AM IST
Highlights

ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సిబిఐ సుప్రీంకోర్టులో శుక్రవారం అఫడివిట్ దాఖలు చేసింది. బాధితుల వాంగ్మూలాలను సేకరిస్తున్న సమయంలో 11 మంది అమ్మాయిల పేర్లు బయటపడ్డాయని, వారిని బ్రజేష్ ఠాకూర్, అతని అనుచరులు చంపి ఉింటారని సిబిఐ చెప్పింది.

న్యూఢిల్లీ: ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ లైంగిక దాడుల కేసులో విస్తుపోయే విషయాలను సిబిఐ బయటపెట్టింది. కేసులోని ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్, అతని అనుచరులు 11 మంది అమ్మాయిలను చంపేశారని సిబిఐ ఆరోపించింది. శ్మశానం నుంచి పెద్ద యెత్తున ఎముకలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 

ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సిబిఐ సుప్రీంకోర్టులో శుక్రవారం అఫడివిట్ దాఖలు చేసింది. బాధితుల వాంగ్మూలాలను సేకరిస్తున్న సమయంలో 11 మంది అమ్మాయిల పేర్లు బయటపడ్డాయని, వారిని బ్రజేష్ ఠాకూర్, అతని అనుచరులు చంపి ఉింటారని సిబిఐ చెప్పింది. 

బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోంలో పలువురు బాలికలపై అత్యాచారం చేసి, వారిని చంపేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదికతో ఆ ఘాతుకాలు వెలుగు చూశాయి. 

కేసులో ఓ నిందితుడు గుడ్డు పటేల్ విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు శ్మశానాన్ని గుర్తించి, తవ్వగా పెద్ద యెత్తున ఎముకలు బయటపడినట్లు తెలుస్తోంది. 

click me!