నాసిక్‌ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్: 22 మంది మృతి, మోడీ సంతాపం

By narsimha lodeFirst Published Apr 21, 2021, 2:29 PM IST
Highlights

మహారాష్ట్రలోని నాసిక్ లో జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సి.జన్ లీకై 22 మంది మరణించారు. 

నాసిక్:మహారాష్ట్రలోని నాసిక్ లో జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సి.జన్ లీకై 22 మంది మరణించారు. . బుధవారం నాడు  ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుండి ఆక్సిజన్ లీకైందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే ప్రకటించారు.ఆక్సిజన్  ట్యాంకర్ నుండి లీకై ఆసుపత్రి నుండి వ్యాపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ సమయంలో ఆసుపత్రిలో  171 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

 

The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour.

| An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp

— ANI (@ANI)

మహారాష్ట్రలోని నాసిక్ లో జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సి.జన్ లీకై 11 మంది మరణించారు. pic.twitter.com/vZRPsDizoH

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లో ఆక్సిజన్ ను నింపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. దీంతో  అరగంటపాటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న  రోగులకు ఆక్సిజన్ అందలేదు. వెంటిటేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో మరణించినట్టుగా  అధికారులు అనుమానిస్తున్నారు.ఆక్సిజన్ లీకైన ఆసుపత్రిలో రెస్కూటీమ్ సహాయక చర్యలను ప్రారంభించింది.

ట్యాంకర్ నుండి ఆక్సిజన్ లీకేజీని సహాయక బృందం అదుపు చేస్తోంది.  ఈ ఘటనను దురదృష్టకరమైందిగా ఎఫ్‌డిఏ మంత్రి డాక్టర్ రాజేంద్రషింగనే తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు 22 మంది మరణించారని ఆయన తెలిపారుఈ ఘటనపై విచారణుకు ఆదేశించినట్టుగా మంత్రి ప్రకటించారు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ఆసుపత్రిలోని 31 మంది రోగులకు వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ వాల్వ్ లీక్ కావడంతో ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందలేదు. సుమారు 30 నిమిషాలపాటు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. బాధ్యుతలపై చర్యలు తీసుకొంటామని సీఎం ప్రకటించారు.నాసిక్  ఆసుపత్రిలో  22 మంది రోగులు మరణించడంపై  ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలిపారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ తన సానుభూతి తెలిపారు. 

మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో  అత్యధికంగా మహారాష్ట్రల్లో నమోదౌతున్నాయి. కరోనా కారణంగా ఆక్సిజన్ డిమాండ్ కూడ మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది.  విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరా చేసే రైల్వే వ్యాగన్  మంగళవారం నాడు బయలుదేరింది.


 

click me!