కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ: 3 నెలలు కోవిడ్ పై పోరాటం

By narsimha lodeFirst Published Jul 30, 2020, 6:04 PM IST
Highlights

మూడు నెలల పాటు చికిత్స పొంది కరోనాను జయించింది 105 ఏళ్ళ వృద్ధురాలు.  సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి చేరుకొన్నారు. చికిత్స సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోకుంండా ఎదుర్కొందని వైద్యులు తెలిపారు. 

తిరువనంతపురం: మూడు నెలల పాటు చికిత్స పొంది కరోనాను జయించింది 105 ఏళ్ళ వృద్ధురాలు.  సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి చేరుకొన్నారు. చికిత్స సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోకుంండా ఎదుర్కొందని వైద్యులు తెలిపారు. 

also read:సగం ఇంజక్షన్ చేసి వదిలేశారు: జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా బాధితురాలి సెల్పీ వీడియో

కేరళలోని కొల్లామ్ జిల్లాలోని ఆంచ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన 105 ఏళ్ల ఆస్మా బీవీ ఏప్రిల్ 20న క‌రోనా బారిన ప‌డ్డారు.ఆస్మా బీవీని చికిత్స కోసం కొల్లామ్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే 105 ఏళ్లు దాటిన ఆస్మా బీవీ కరోనాను తట్టుకొంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు వైద్యులు.మూడు నెలలపాటు చికిత్స పొందిన తర్వాత ఆమె కరోనాను జయించింది. 

ఇదివరకు ఇదే రాష్ట్రంలోని 93 ఏళ్ల థామస్ అబ్రహం కరోనా నుండి కోలుకొన్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచారు. కానీ ఆయన రికార్డును ఆస్మా బీవీ బద్దలు కొట్టారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ కరోాను జయించిన ఆస్మా బీవీని అభినందించారు. వృద్ధులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులను మంత్రి శైలజ అభినందించారు. 


 

click me!