అర్థనగ్నంగా దేహంపై పిల్లలతో...: ఆమెను ఆరెస్టు చేయకపోవడంపై పిల్

Published : Jul 30, 2020, 05:34 PM IST
అర్థనగ్నంగా దేహంపై పిల్లలతో...: ఆమెను ఆరెస్టు చేయకపోవడంపై పిల్

సారాంశం

సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయకపోవడంపై ఓ న్యాయవాది కేరళ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అర్ధనగ్నంగా ఉండి పిల్లలతో పెయింటింగ్ వేయించుకున్న కేసులో ఆ పిల్ దాఖలైంది.

కొచ్చి: సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయకపోవడంపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల సంరక్షణ చట్టం కింద నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెపై కేసు నమోదై రోజులు గడుస్తున్నప్పటికీ ఆమెను ఎందుకు అరెస్టు చేయడం లేదని తిరువళ్లకు చెందన న్యాయవాది ఏవీ అరుణ్ ప్రకాష్ కేరళ హైకోర్టులో ప్రజచా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

ఈ కేసు విచారణలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని ఆయన పిటిషన్ లో విమర్శించారు. విచారణ అధికారులను మార్చి, ఈ కేసు విచారణ కమిషనర్ పరిధిలో త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని ఆయన హైకోర్టును కోరారు.

తనపై నమోదైన కేసుల్లో రెహానా ఫాతిమా దాఖలు చేసుకున్న ముందస్తుత బెయిల్ పిటిషన్ ను కేరళ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. ఆమె అర్థనగ్నంగా ఉండి దేహంపై తన పిల్లలతో పెయింటింగ్ వేయించుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఈ ఘటనపై ఆమె లైంగిక వేధింపుల కేసుతో పాటు బాలల సంరక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదైంది. తన సిద్ధాంతాల ప్రకారం తన పిల్లకు ఫాతిమా లైంగిక విద్యను బోధించవచ్చునని, కానీ ఆ విద్య ఇలా బహరింగంగా కాకుండా నాలుగు గోల మధ్య ఉండాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తును కొనసాగించాలని విచారణాధికారిని ఆదేశించారు. ఇదిలావుంటే, రెహానా ఫాతిమా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu