Govinda: వెయ్యి కోట్ల ఆన్‌లైన్ స్కామ్‌.. బాలీవుడ్ యాక్ట‌ర్ గోవిందాను ప్ర‌శ్నించనున్న అధికారులు

Bollywood actor Govinda: రూ.1,000 కోట్ల ఆన్‌లైన్ పోంజీ స్కామ్ లో గోవిందను విచారించనున్నారు. రూ.1,000 కోట్ల ఆన్‌లైన్ పోంజీ స్కామ్ కు సంబంధించి బాలీవుడ్ న‌టుడు  గోవిందాను ప్రశ్నిస్తామని ఒడిశా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెల్ల‌డించింది. గోవిందా అనుమానితుడు లేదా నిందితుడు కాదు, కానీ చివరికి ఈఓడబ్ల్యూ సాక్షిగా మారవచ్చున‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
 

Google News Follow Us

Online Ponzi Scam: రూ.1,000 కోట్ల ఆన్‌లైన్ పోంజీ స్కామ్ లో గోవిందను విచారించనున్నారు. రూ.1,000 కోట్ల ఆన్‌లైన్ పోంజీ స్కామ్ కు సంబంధించి బాలీవుడ్ న‌టుడు  గోవిందాను ప్రశ్నిస్తామని ఒడిశా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెల్ల‌డించింది. గోవిందా అనుమానితుడు లేదా నిందితుడు కాదు, కానీ చివరికి ఈఓడబ్ల్యూ సాక్షిగా మారవచ్చున‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకెళ్తే.. రూ. 1,000 కోట్ల పాన్-ఇండియా ఆన్‌లైన్ పోంజీ స్కామ్ విచారణకు సంబంధించి గోవిందాను ప్రశ్నిస్తామని ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) తెలిపింది. అనేక దేశాల్లో ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉన్న సోలార్ టెక్నో అలయన్స్ (STA-టోకెన్) క్రిప్టో పెట్టుబడి ముసుగులో స్కామ్ కింద అక్రమంగా పిరమిడ్ నిర్మాణాన్ని నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో గోవింద.. 

ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో బాలీవుడ్ నటుడు గోవిందా పేరును ఈఓడబ్ల్యూ ప్రశ్నించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  నటుడు కొన్ని ప్రచార వీడియోలలో కంపెనీ కార్యకలాపాలను ఆమోదించినట్లు నివేదించబడింది. EOW ఇన్‌స్పెక్టర్ జనరల్ జేఎన్ పంకజ్ మీడియాతో మాట్లాడుతూ.. "జూలైలో గోవాలో జరిగిన ఎస్టీయే గ్రాండ్ ఫంక్షన్‌కు హాజరైన వాటితో స‌హా  కొన్ని వీడియోలలో కంపెనీని ప్రమోట్ చేసిన ఫిల్మ్‌స్టార్ గోవిందను ప్రశ్నించడానికి మేము త్వరలో ఒక బృందాన్ని ముంబైకి పంపుతాముని" తెలిపారు. 

"సీనియర్ నటుడు గోవిందా అనుమానితుడు లేదా నిందితుడు కాదు. అతని కచ్చితమైన పాత్ర విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది. వారి వ్యాపార ఒప్పందం ప్రకారం ఉత్పత్తి (STAToken బ్రాండ్) ఆమోదానికి మాత్రమే అతని పాత్ర పరిమితమైందని మేము కనుగొంటే, మేము అతనిని మా కేసులో సాక్షిగా చేస్తాము" అని పంకజ్ వెల్ల‌డించారు. భద్రక్, కియోంఝర్, బాలాసోర్, మయూర్‌భంజ్, భువనేశ్వర్‌లోని 10,000 మంది నుండి కంపెనీ రూ.30 కోట్లు వసూలు చేసిందని స‌మాచారం.

నివేదికల ప్రకారం.. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా విస్త‌రించి ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల్లోని పెట్టుబడిదారుల నుండి డిపాజిట్లలో కోట్లాది రూపాల‌య డ‌బ్బు తీసుకున్నారు. ఈ కంపెనీ అధినేత‌లు, ఒడిశా  చీఫ్ లు  గుర్తేజ్ సింగ్ సిద్ధూ, నిరోద్ దాస్‌లను EOW అరెస్టు చేసింది.  భువనేశ్వర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రత్నాకర్ పాలైని సిద్ధూతో సంబంధం ఉన్నందుకు ఆగస్టు 16న అరెస్టు చేశారు. హంగేరీ దేశస్థుడైన కంపెనీ చీఫ్ డేవిడ్ గెజ్‌పై లుకౌట్ సర్క్యులర్‌లు జారీ అయ్యాయి.