100 గంటల్లో 100 కి.మీ.ల ఎక్స్‌‌ప్రెస్ వే నిర్మించి రికార్డు.. నితిన్ గడ్కరీ ప్రశంసలు

Published : May 19, 2023, 07:37 PM IST
100 గంటల్లో 100 కి.మీ.ల  ఎక్స్‌‌ప్రెస్ వే నిర్మించి రికార్డు.. నితిన్ గడ్కరీ ప్రశంసలు

సారాంశం

గజియాబాద్.. అలీగడ్‌ల మధ్య 100 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వేను కేవలం 100 గంటల్లోనే నిర్మించారు. దేశంలో రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.  

న్యూఢిల్లీ: గజియాబాద్ - అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే చరిత్ర సృష్టించింది. 100 కిలోమీటర్ల రోడ్డును 100 గంటల్లో నిర్మించినట్టు ఈ రోజు విడుదలైన అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల  పట్టుదల, కమిట్‌మెంట్‌ను వెల్లడిస్తున్నదని తెలిపింది. 

వర్చువల్‌గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గజియాబాద్, అలీగడ్ సెక్షన్ ఆఫ్ ఎన్‌హెచ్ 34.. సుమారు 118 కిలోమీటర్ల మేరకు ఉన్న దారి కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. జన సాంధ్రత అధికంగా ఉండే గజియాబాద్, అలీగడ్‌లను కలుపుతున్న ఈ రోడ్డు కీలక పాత్ర నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికింద్రబాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతూ సాగుతుందని తెలిపారు. సరుకుల రవాణాకు ఈ దారి కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే, ఈ రీజియన్ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను కలిపే ఈ దారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. 100 గంటల్లోనే ఈ రోడ్డును 100 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారని చెప్పారు.

Also Read: రూ.2 లక్షలిస్తారా , పేల్చేయమంటారా.. మానవ బాంబు గెటప్‌లో బ్యాంక్‌లోకి : షాపూర్‌ నగర్‌లో కలకలకం

ఈ వినూత్న హరిత సాంకేతికత 90 శాతం మిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తుందని అన్నారు.

ఫలితంగా పది శాతం వర్జిన్ మెటీరియల్స్‌ను వినియోగితం 10 శాతానికి తగ్గుతుందని వివరించారు.

ఈ విధానాన్ని ఎంచుకుని చమురు వినియోగాన్ని చాలా వరకు తగ్గించామని చెప్పారు. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని, తద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo