బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: 10 మంది మావోల మృతి

Published : Feb 07, 2019, 01:09 PM IST
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: 10 మంది మావోల మృతి

సారాంశం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో గురువారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు.  ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.


బీజాపూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో గురువారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు.  ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై మావోలు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందనిి పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉంది.  మావోలకు , పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi