గుజరాత్‌లో కారు, ట్రక్కు ఢీ: 10 మంది మృతి

Published : Jun 16, 2021, 10:22 AM IST
గుజరాత్‌లో కారు, ట్రక్కు ఢీ: 10 మంది మృతి

సారాంశం

కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలోని ఇంద్రనాజ్ గ్రామసమీపంలో బుధవారం నాడు ఉదయం జరిగింది.  ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌ను అహ్మదాబాద్ జిల్లాలోని వటమన్ ను కలిపే రాష్ట్ర రహదారిపై  ఈ ప్రమాదం జరిగింది.

గాంధీనగర్: కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలోని ఇంద్రనాజ్ గ్రామసమీపంలో బుధవారం నాడు ఉదయం జరిగింది.  ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌ను అహ్మదాబాద్ జిల్లాలోని వటమన్ ను కలిపే రాష్ట్ర రహదారిపై  ఈ ప్రమాదం జరిగింది.

చిన్నారితో సహా 10 మంది ప్రయాణీస్తున్న కారును అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. కారు వటమన్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. కారు నుండి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు.

మృతులను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కారు నుండి మృతదేహాలను బయటకు తీసేందుకు సహకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?