కోవిడ్ 19 : దేశంలో కొత్తగా 62 వేల కేసులు, లక్షకు పైనే రికవరీలు..

Published : Jun 16, 2021, 10:07 AM IST
కోవిడ్ 19 : దేశంలో కొత్తగా 62 వేల కేసులు, లక్షకు పైనే రికవరీలు..

సారాంశం

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు దిగువనే నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో మరో 62 వేల మంది వైరస్ బారిన పడగా, లక్ష పైనే కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.  అయితే  క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.  

మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా 19 లక్షల 30 వేల 987 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 62,224 మందికి పాజిటివ్ గా తేలింది.  దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96 కోట్లకు చేరింది. వరుసగా తొమ్మిదో రోజు పాజిటివ్ రేటు 5 శాతానికి దిగువనే ఉంది.

ఇదే సమయంలో1,07,638 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  దీంతో మొత్తం వారి కోలుకున్న వరి సంఖ్య2.83 కోట్లుగా  ఉంది. రికవరీ రేటు 95.80 శాతానికి పెరిగింది.

కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో  క్రియాశీల కేసుల సంఖ్య 9 లక్షల దిగువకు పడిపోయింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,65,432మంది వైరస్ తో  బాధ పడుతున్నారు.  క్రియాశీల రేటు2.92 శాతంగా ఉంది.

ఇక మరణాల సంఖ్య కూడా మూడు వేలకు దిగువనే ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. 24 గంటల వ్యవధిలో మరో 2542 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,79,573 మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయం గా కొనసాగుతోంది.  నిన్న మరో 28 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నవారు సంఖ్య 26 కోట్లు దాటింది.
 
PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu