రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ముంబైకు

Published : Jul 07, 2019, 12:37 PM ISTUpdated : Jul 07, 2019, 12:38 PM IST
రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ముంబైకు

సారాంశం

తమ  పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎమ్మెల్యేలు విమానంలో బెంగుళూరు నుండి ముంబైకు చేరుకొన్నారు.  

బెంగుళూరు: తమ  పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎమ్మెల్యేలు విమానంలో బెంగుళూరు నుండి ముంబైకు చేరుకొన్నారు.

ముంబైలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేశారు. 13 మాసాల క్రితం జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.అయితే ఈ సంకీర్ణ కూటమికి చెందిన  ముగ్గురు  జేడీ(ఎస్), 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.రాజీనామాలను స్పీకర్‌‌కు సమర్పించారు. 

అమెరికా పర్యటన నుండి  కర్ణాటక రాష్ట్ర సీఎం కుమారస్వామి ఆదివారం సాయంత్రం తిరిగి రానున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి  కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జేడీ(ఎస్) కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎ.హెచ్. విశ్వనాథ్  , గోపాలయ్య, నారాయణ గౌడ లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. 

మాజీ మంత్రి రామలింగారెడ్డి కూడ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సిద్దరామయ్య మంత్రివర్గంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు. కుమారస్వామి మంత్రివర్గంలో రామలింగారెడ్డికి చోటు దక్కలేదు.మరో మాజీ మంత్రి రమేష్ జర్కోలి, మహేష్ కుమతల్లి, ప్రతాప్ గౌడ పాటిల్, మునిరత్న భైరతి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్, బిసీ పాటిల్ 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు