పవర్ ప్రాజెక్ట్ సైట్ లో పెను ప్రమాదం.. కొండచరియలు విరిగి పడటంతో  ఒకరి మృతి.. పలువురికి గాయాలు

Published : Oct 30, 2022, 05:29 AM IST
పవర్ ప్రాజెక్ట్ సైట్ లో పెను ప్రమాదం.. కొండచరియలు విరిగి పడటంతో  ఒకరి మృతి.. పలువురికి గాయాలు

సారాంశం

జమ్మూ , కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని ద్రబ్‌షాల్లా వద్ద నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జేసీపీ ఆపరేటర్ మరణించారు . దాదాపు అర డజను మంది గాయపడ్డారు . సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, నలుగురైదుగురు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది.  ద్రబ్‌షాల్లా వద్ద నిర్మాణంలో పవర్ ప్రాజెక్ట్ సైట్ లో  రోడ్డు నిర్మాణంలో శనివారం నాడు కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. 

కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాట్లే పవర్ ప్రాజెక్ట్ సైట్ సమీపంలో అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో కూలీలు పనిచేస్తున్నారని, జెసిబి యంత్రం తవ్వుతుండగా భారీ రాయి బోల్తా పడి కార్మికులు చిక్కుకుపోయిందని చెప్పారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శిథిలాల నుంచి ఐదుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనలో జేసీబీ ఆపరేటర్ మరణించినట్టు తెలిపారు. శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు యాదవ్ తెలిపారు. ఆర్మీ, పోలీసులు, పరిపాలన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రాట్లే పవర్ ప్రాజెక్ట్ స్థలంలో కొండచరియలు విరిగిపడటం గురించి సమాచారం అందుకున్న తర్వాత డిప్యూటీ కమిషనర్ యాదవ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలంలో మోహరించిన దాదాపు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీం కూడా దురదృష్టవశాత్తు శిథిలాల కింద చిక్కుకుపోయింది. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.  

సాయంత్రం 5 గంటల సమయంలో, కొండపై నుండి కొన్ని బండరాళ్లు రోడ్డుపై పడటంతో, జెసిబి ఆపరేటర్ రహదారిని క్లియర్ చేస్తున్నాడని వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో  కొండచరియలు విరిగిపడటంతో జెసిబి, దాని డ్రైవర్ శిధిలాల కింద చిక్కుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?