తమిళనాడు జల్లికట్టులో విషాదం: ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

Published : Jan 16, 2020, 12:22 PM IST
తమిళనాడు జల్లికట్టులో విషాదం: ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టులో గురువారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందితే మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 


చెన్నై; తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి సమీపంలో మరయూరు జల్లికట్టు సందర్భంగా గురువారం నాడు విషాదం చోటు చేసుకొంది. జల్లికట్టులో పాల్గొన్న ఎద్దులు జనంపైకి దూసుకొచ్చాయి.ఈ ఘటనలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

తమిళనాడు రాష్ట్రంలోని  మరయూరు జల్లికట్టులో గురువారంనాడు ఈ ఘటన చోటు చేసుకొంది.  జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన జనంపైకి ఎద్దులు దూసుకెళ్లాయి. దీంతో మహాలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్