మాకు బలం లేదని ఎవరు చెప్పారు: సోనియాగాంధీ సంచలనం

First Published Jul 18, 2018, 4:52 PM IST
Highlights

కేంద్రంపై అవిశ్వాసాన్ని  ప్రతిపాదించిన సమయంలో  తమకు సరిపోను  బలం ఉందని  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాసాన్ని  ప్రతిపాదించిన సమయంలో  తమకు సరిపోను  బలం ఉందని  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. 

కేంద్రంపై అవిశ్వాసంపై చర్చకు స్పీకర్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత  సోనియాగాంధీ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. మాకు సరిపోను బలం లేదని మీకు ఎవరు చెప్పారని సోనియగాంధీ ప్రశ్నించారు.

బీజేపీయేతర పక్షాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంపై చర్చను శుక్రవారం నాడు లోక్‌సభలో చేపట్టనున్నారు. దీంతో పార్లమెంట్‌లో  అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం కానున్నారు.

ఇదిలా ఉంటే బీజేడీ ప్రస్తుతం బీజేపీకి దూరంగా ఉంటుంది. కేంద్రంపై అవిశ్వాసం సమయంలో బీజేడీ ఏ రకమైన వైఖరిని తీసుకొంటుందనే విషయమై  ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు  కూడ  బీజేపీయేతర పక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు.

2019 డిసెంబర్ మాసంలో  కొన్నిరాష్ట్రాల ఎన్నికలతో పాటు  పార్లమెంట్‌కు కూడ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఇదిలా ఉంటే  వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల కూటమి  ఏర్పాటుకు  ఈ అవిశ్వాస తీర్మాణం పనికొచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!