ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీ అమ్మాయిలపై సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 10, 2019, 2:33 PM IST
Highlights

బీహార్ కు చెందిన అమ్మాయిని తన కోడలుగా తెచ్చుకుంటానని మన మంత్రి ఓపి ధనకర్ అన్నారని, కానీ ప్రజలు ఇప్పుడు కశ్మీర్ దారి పట్టారని ఖట్టర్ అన్నారు. కశ్మీర్ అంశంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అక్కడి నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. 

చండీగఢ్: కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాలా ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫతేబాదులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. బేటీ బచావో - బేటీ పడావో విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

బీహార్ కు చెందిన అమ్మాయిని తన కోడలుగా తెచ్చుకుంటానని మన మంత్రి ఓపి ధనకర్ అన్నారని, కానీ ప్రజలు ఇప్పుడు కశ్మీర్ దారి పట్టారని ఖట్టర్ అన్నారు. కశ్మీర్ అంశంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అక్కడి నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. 

ఇప్పుడు కాశ్మీర్ తలుపులు తెరుచుకున్నాయని, అక్కడి నుంచి అమ్మాయిలను తెచ్చుకోవచ్చునని ప్రజలు అంటున్నారని ఖట్టర్ అన్నారు. ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చునని యుపి బిజెపి శాసనసభ్యుడు విక్రమ్ సైనీ ఇటీవల చేసిన వ్యాఖ్య దుమారం రేపిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం వల్ల లిగం నిష్పత్తి వ్యత్యాసం తగ్దిందని ఖట్టర్ అన్నారు. ప్రతి వేయి మంది బాలురకు 850  మంది మాత్రమే బాలికలు ఉండేవారని, ఇప్పుడు 933 మంది బాలికలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. 

click me!