జమ్మూ కాశ్మీర్ లో 144సెక్షన్ ఎత్తివేత.. తెరుచుకున్న విద్యా సంస్థలు

By telugu teamFirst Published Aug 10, 2019, 2:02 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. కాగా.. శనివారం నుంచి శనివారం నుంచి అక్కడ 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్ లో పరిస్థితిలో సాదారణ స్థితికి వచ్చేశాయి. జమ్మూ కాశ్మీర్ లో అధికారులు 144 సెక్షన్ ని ఎత్తి వేశారు. దీంతో.. జమ్మూలోని స్కూల్స్ , కాలేజీలు మళ్లీ తెరుచుకున్నాయి. వారం రోజులుగా భద్రతా బలగాల వలయంలో ఉన్న జమ్మూ ప్రాంతం ఇప్పుడు సాదారణ స్థితికి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. కాగా.. శనివారం నుంచి శనివారం నుంచి అక్కడ 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఈ క్రమంలో నేటి నుంచి విద్యా సంస్థలు కూడా తెరుచుకున్నాయి. 

భద్రతా పరమైన ఆంక్షలు ఎత్తివేయడంతో శుక్రవారం జమ్మూలో అనేకమంది ముస్లింలు మసీదులకు వచ్చి ప్రార్థనలు చేశారు. జమ్మూలో పరిస్థితులు చక్కబడుతున్నా కశ్మీర్‌లో మాత్రం ఇంకా ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సలహా మేరకు కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

click me!