‘‘ప్రియాంక అందంగా ఉందని.. జనాలు ఓట్లు వేయరు’’

Published : Jan 25, 2019, 01:50 PM IST
‘‘ప్రియాంక అందంగా ఉందని.. జనాలు ఓట్లు వేయరు’’

సారాంశం

ప్రియాంక గాంధీ అందంగా ఉంది కదా.. అని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరని బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ నారాయణ ఝూ అభిప్రాయపడ్డారు.

ప్రియాంక గాంధీ అందంగా ఉంది కదా.. అని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరని బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ నారాయణ ఝూ అభిప్రాయపడ్డారు. ప్రియాంకను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ.. రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ప్రియాంక గాంధీ చూడటానికి చాలా అందంగా ఉంటుందని.. కాకపోతే ఆమెకు ఎలాంటి రాజకీయ ఘనత లేదని వినోద్ నారాయణ ఝూ అన్నారు. అందమైన మొహాలను చూసి ఎవరూ ఓట్లు వేయరు అంటూ ఎద్దేవా చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రియంక ప్రభావం అసలు యూపీలో ఉండదని ఆయన స్పష్టం చేశారు.

అందులోనూ ఆమె రాబర్ట్ వాద్రా భార్య అని.. ఆయన భూ కుంభకోణంతోపాటు పలు ఇతర అవినీతి కేసుల్లో చిక్కుకున్నారని గుర్తు చేశారు. ఇదే విషయంపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా స్పందించారు. ఓ అవినీతి మచ్చ ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉన్న మహిళ రాజకీయాల్లోకి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..