నేనే హోం మంత్రినైతే మేధావులను బ్రతకనివ్వను: బిజెపి ఎమ్మెల్యే సంచలనం

First Published Jul 28, 2018, 3:07 PM IST
Highlights

కర్ణాటకలో ప్రతిపక్ష బిజెపి పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ దివస్ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన  ప్రసంగం  ఇపుడు  వివాదాస్పదమవుతోంది. దేశంలో మేదావులుగా పేర్కొంటూ సైనికులపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్కౌంటర్ చేయించేవాడినంటూ ఎమ్మెల్యే వివాదానికి
తెరతీశారు.   

కర్ణాటకలోని విజయపురి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బసవగౌడ్ పాటిల్ ''కార్గిల్ విజయ్ దివస్'' సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తన ప్రసంగంలో మేధావులు, ఉదారవాదులపై విరుచుకుపడ్డారు. దేశంకోసం ప్రాణాలను అర్పించే సైనికుల గురించి తమకు తాము మేధావులుగా చెప్పుకునే వారు విమర్శించడం తననెంతో భాదించిందని బసవ గౌడ అన్నారు. తానే కేంద్ర హోం మంత్రినైతే ఇలాంటి మేధావులను కాల్చి చంపాలని ఆదేశించేవాడినని, కానీ తనకా అవకాశం రాలేదన్నారు. 

దేశానికి మిగతావారికంటే ఈ మేధావులు, లౌకికవాదుల వల్లే ఎక్కువ ప్రమాదం పొంచివుందన్నారు. ప్రజాధనంతో ప్రభుత్వం అందించే సౌర్యాలను పొందుతూ కూడా ఇలా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వారికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులంతా ఇలాగే తయారయ్యారని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. 

click me!