ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం ఏం కోరుకుంటుటుందో ఆయన వివరించారు.
న్యూఢిల్లీ: హిందూ సమాజం ప్రస్తుతం అయోధ్య, కాశీ మధురల గురించి అడుగుతున్నారని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మహాభారతంలో కృష్ణుడు ఐదు గ్రామాలకు గురించి అడిగినట్టుగా పురాణాల్లో చెప్పిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
బుధవారంనాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య దీపోత్సవం జాతీయ సంబరంగా నిర్వహించడం తమ ప్రభుత్వం అదృష్టంగా భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
undefined
గత ప్రభుత్వాల హయంలో అయోధ్యలో కర్ఫ్యూలు కొనసాగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ప్రణాళికా బద్దంగా అయోధ్యను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఈ రకమైన పరిస్థితిని తాను ఎక్కడా చూడలేదన్నారు.
మధురలో శ్రీకృష్ణ జన్మభూమి, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్ కూడ తమ భూభాగాలేనని హిందూవులు పేర్కొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అన్యాయం గురించి మాట్లాడే సమయంలో తాము ఐదువేల ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మహాభారతంలో పాండవులకు అన్యాయం జరిగిందన్నారు. అదే తరహాలోనే అయోధ్య, కాశీ, మధురలో కూడ జరిగిందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
మహాభారతంలోని ఓ పద్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దుర్యోధనుడు ఐదు గ్రామాలను పాండవులకు ఇచ్చి ఆశీర్వదించలేకపోయాడన్నారు.
మహాభారతంలోని పురాణ గాధ మేరకు పాండవులకు ఐదు గ్రామాలు ఇవ్వాలని కౌరవుల వద్దకు శ్రీకృష్ణుడు రాయబారం వెళ్లిన విషయాన్ని యూపీ సీఎం యోగి గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హిందూ సమాజం ఏళ్ల తరబడి మూడు మాత్రమే కోరుతున్నాయని ఆయన చెప్పారు. అయోధ్య, మధుర, వారణాసి అని ఆయన గుర్తు చేశారు.
వారణాసి జ్ఞానవాసీ మసీదు కాంప్లెక్స్ బేస్ మెంట్ లో హిందూవుల దేవతా విగ్రహాల వద్ద పూజలు చేసుకొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
రాజకీయ మొండితనం, ఓటు బ్యాంకు రాజకీయాలు వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. తాము మాత్రం మూడు స్థలాలను మాత్రమే అడిగామని, ఇతర స్థలాలతో ఎలాంటి వివాదం లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.