ఆస్పత్రిలో 100 మంది పసిపిల్లల మృతి: గెహ్లాట్ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Jan 2, 2020, 6:14 PM IST
Highlights

కోటలోని లోన్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు వందకు పైగా పసిపిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు మరణాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలిపారు.

జైపూర్: కోటాలోని జేకే లోన్ ఆస్పత్రిలో 100 మంది పసి పిల్లలు మృతి చెందడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆత్మరక్షణలో పడ్డారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ఆయన గురువారంనాడు విజ్ఞప్తి చేశారు 

పసి పిల్లల మరణాలపై బిజెపి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని బీఎస్పీ అధినేత మాయావతి దుయ్యబట్టారు. ఈ సంఘటనపై కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని ఆమె ప్రశ్నించారు .

మృత్యువాత పడిన తల్లులను కలుసుకోకుండా సిఏఏ వ్యతిరేక ఆందోళనలో చెలరేగిన హింసకు సంబంధించిన బాధిత కుటుంబాలను కలుసోకవడం డ్రామాగానే భావించాల్సి ఉంటుందని మాయావతి ప్రియాంక గాంధీపై మండిపడ్డారు. 

పిల్లల మరణాలపై ప్రభుత్వం స్పందిస్తోందని, ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఆస్పత్రిలో పిల్లల మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇంకా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తామని, తల్లులూ పిల్లలూ ఆరోగ్యంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, తమ అత్యధిక ప్రాధాన్యం దానికేనని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు 

click me!