ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ చార్జీషీట్ కల్పితం: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

By narsimha lodeFirst Published Feb 2, 2023, 7:08 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంపై  ఈడీ అధికారులు దాఖలు  చేసిన  చార్జీషీట్ కల్పితమని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయంగా తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు  కేంద్రం దర్యాప్తు సంస్థలను  ఉపయోగించుకుంటుందని  ఆయన  విమర్శించారు.   

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ దాఖలు  చేసిన  రెండో  చార్జీషీట్  పై  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై  గురువారం నాడు  ఈడీ అధికారులు  రెండో చార్జీషీట్ దాఖలు  చేశారు.ఈ చార్జీషీట్  పై  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  తో పాటు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లు  కూడా  చేర్చారు ఈడీ అధికారులు.  ఈ చార్జీషీట్ పూర్తి కల్పితమైందన్నారు. ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఈడీని  కేంద్రం ఉపయోగించుకుంటుందని  ఆయన ఆరోపించారు.  తన ప్రభుత్వాన్ని అస్థిపర్చేందుకు  ఈడీని కేంద్రం  ఉపయోగిస్తుందని ఆయన ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం  దర్యాప్తు సంస్థలను  విపక్ష పార్టీల  ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకు  కేంద్రం  ఉపయోగిస్తుందని ఆయన ఆరోపించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ దాఖలు చేసిన  చార్జీషీట్లలో ఎంతమందికి  శిక్షలు పడ్డాయో చెప్పాలన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం నిధులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తన చార్జీషీట్ లో  పేర్కొంది.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆప్, బీఆర్ఎస్ ను లక్ష్యంగా  చేసుకొని బీజేపీ విమర్శలు చేస్తుంది.  ఈ స్కాంలో  ఆప్, బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని   బీజేపీ నేతలు విమర్శలు  చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం  విషయమై  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  ఈడీ, సీబీఐ అధికారులు  గతంలో  పలు మార్లు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో  ఇప్పటికే  ఆరుగురిని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అరెస్ట్  చేసిన వారిలో  తెలుగు రాష్ట్రాలకు  చెందినవారున్నారు.

click me!