Viral Prapancham Movie Review: డిజిటల్‌ ప్రేమ కొంపముంచిందా?.. `వైరల్‌ ప్రపంచం` మూవీ రివ్యూ

Viral Prapancham Movie Review: డిజిటల్‌ ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం `వైరల్‌ ప్రపంచం`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Viral Prapancham movie review in telugu arj

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో ఉన్నాయి. యువత సోషల్‌ మీడియాలో బిజీగా ఉన్నారు. వాటిపైనే ఆధారపడుతుంటారు. వ్యక్తిగత సంబంధాలకంటే డిజిటల్‌ రిలేషన్స్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. చివరికి ప్రేమను కూడా అందులోనే వెతుక్కుంటున్నారు. మరి డిజిటల్‌ అనర్థాలను తెలియజేసే కథాంశంతో `వైరల్‌ ప్రపంచం` పేరుతో సినిమాని రూపొందించారు.

 వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోప్రియాంక శర్మ, నిత్యాశెట్టి, సాయి రోనక్‌, సన్నీ, నవీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిగా, బ్రిజేష్‌ టాంగి దర్శకత్వం వహించారు. అకిల తంగి నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(మార్చి 7)న విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. 

క‌థ‌:

Latest Videos

తెలుగమ్మాయి స్వప్న(ప్రియాంక శర్మ) అమెరికాలో ప్రేమలో పడుతుంది. అక్కడ మన తెలుగబ్బాయి రవి(సాయి రోనక్‌)తో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. ఆ ప్రేమని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్య‌శెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్ర‌వీణ్‌ (స‌న్నీ న‌వీన్) అనే అబ్బాయితో పరిచయం పెంచుకుంటుంది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ఎమోషనల్‌గా క్లోజ్‌ కావాలనుకుంటారు.

ఈ క్రమంలో అటు స్వప్న, ఇటు అదితి తమ లవర్స్ ని దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు ఎక్కువగా తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను, ఇంటర్నెట్‌ను నమ్ముతారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఓ ప్రళయం. ఆశలన్నీ అడియాశలు అవుతాయి. నమ్మకాలపై దెబ్బ పడుతుంది. మరి వారి నమ్మకాన్ని దెబ్బ‌కొట్టింది ఎవ‌రు? ప్రాణాలను బలిగొన్న ఘ‌ట‌న ఏంటీ? అనంతరం కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణః 

డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి జీవితాలు తలక్రిందులవుతున్నాయి. అవి కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అలాంటి జోనర్‌లో తెర‌కెక్కిన మూవీ `వైరల్ ప్రపంచం`. టెక్నాలజీ, సోషల్‌ మీడియా, డిజిటల్‌ రంగంలో మనిషి దేనికి ప్రయారిటీ ఇస్తున్నారనేది ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. ఏది అనర్థం, ఏది మంచిది? దేని ఎంత వరకు వాడుకోవాలి అనేది చర్చించారు.

నేటి ట్రెండ్‌ని, యువత పోకడలన ఆవిష్కరించిన మూవీ ఇది. మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చూస్తాం. కానీ నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు` అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుండి దూకడంతో ప్రారంభమయ్యే సస్పెన్స్ రిలేషన్ షిప్ డ్రామా. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్‌లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసెస్‌ల ద్వారా జరుగుతుంది.

ఈ కథ వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయో దాని గురించి, ఉన్నత చదువుల కోసం సుదూర సంబంధాలను, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నారో చెబుతుంది. ఈ కాలంలో ఇంటర్నెట్‌లో యువతులు, మహిళల గోప్యతను మంట‌గ‌లుపుతున్న‌ సైబర్ నేరాన్ని కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తుంది. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తుంది. సస్పెన్స్ అంశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. 

‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే ఈ సినిమాలోని డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాల‌నుకున్న స‌బ్జెక్టును తెర‌కెక్కించ‌డంతో స‌క్సెస్ అయ్యాడు దర్శకుడు బ్రిజేష్ టాంగి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈనాటి యువ‌త‌కు అర్థ‌మ‌య్యేలా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడు. కంప్యూటర్ స్క్రీన్‌లపై జరిగే ఒక ఉత్కంఠభరితమైన క‌థ‌నం, ఇది సుదూర సంబంధాలను, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ సంబంధాలు ఎలా ప్రభావితమవుతున్నాయో చెప్పిన తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తుంది.

రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్ వల్ల ఎంతోమంది జీవితాలు ఎలా నాశనమయ్యాయి అనేదాని ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ త‌రం యువ‌త‌ను ఆలోచింప‌జేస్తుంది, వారికి ఓ విలువైన సందేశం ఇస్తుంది. యువ‌త‌కు ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతుంది. అయితే కథనం సాగే తీరు కొంత స్లో అనిపిస్తుంది. ల్యాగ్‌ ఫీలింగ్‌‌ కలుగుతుంది. రిలేషన్స్ కి సంబంధించి మరింత డెప్త్ చూపించాల్సింది. యువత పెడదోరణులను షుగర్‌ కోటింగ్‌లో చెబితే ఇంకా బాగుండేది. 

న‌టీన‌టులుః
ఈ సినిమాలో రెండు జంట‌లు ప‌ర్‌ఫెక్టుగా కుదిరాయి. రవి పాత్ర‌లో సాయి రోనక్, స్వ‌ప్న పాత్ర‌లో ప్రియాంక శర్మ, అదితి పాత్ర‌లో నిత్య‌శెట్టి, ప్ర‌వీణ్ పాత్ర‌లో స‌న్నీ న‌వీన్.. ఈ త‌రం యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా క‌నిపించారు. చాలా సహజంగా నటించే ప్రయత్నం చేశారు. లవ్‌ సీన్లు, వారు చేసే పనులు రియాలిటీకి దగ్గరగా ఉండటంతో బాగా కనెక్ట్ అవుతాయి. ఈ నాలుగు ముఖ్య‌పాత్ర‌దారులు స‌హ‌జ భావోద్వేగాన్ని పండించారు. మిగిలిన వారు జస్ట్ ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం:

మ్యూజిక్ ఎంతో ఎమోష‌న‌ల్ ఫీల్ క‌లిగిస్తుంది. ఆర్‌ఆర్‌ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్ ప‌ర్‌ఫెక్టుగా కుదిరింది. ఇక కెమెరా ప‌నిత‌నం ప‌ర‌వాలేదు. స్క్రీన్ బేస్డ్‌ను చాలా నాచుర‌ల్‌గా తెర‌కెక్కించారు. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. దర్శకుడు ంచి సందేశాన్ని అందించడం కోసంచేసిన ప్రయత్నం అభినందనీయమని చెప్పొచ్చు.

ఫైనల్‌గాః ఓవరాల్‌గా సస్పెన్స్, థ్రిల్ తో కూడిన సందేశాత్మక మూవీ.  
రేటింగ్‌ః 2.5
read more: Kingston Movie Review: `కింగ్‌స్టన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్‌ చేసుకున్న సెన్సేషనల్‌ స్టార్‌ ఎవరో తెలుసా? తారకరత్న కాదు.. అప్పట్లో ఆయనో సునామీ

vuukle one pixel image
click me!