రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్` మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది. `మ్యాడ్ 2` టీజర్ తాజాగా శివరాత్రి సందర్భంగా మంగళవారం విడుదలైంది. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
`మ్యాడ్` మూవీ రెండేళ్ల క్రితం వచ్చి పెద్ద హిట్ అయ్యింది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐలకు మదుసూధన్ గౌడ్ కలిసి నవ్వులు పంచారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీనికి ఇప్పుడు సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు. `మ్యాడ్ స్క్కేర్`(మ్యాడ్ 2) పేరుతో దీన్ని రూపొందించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
టైటిల్‌లోనే ఉంది `మ్యాడ్` అని, ఈ టీజర్ చూసి మ్యాడ్ కూడా సరిపోదనేలా ఉంది. ప్రారంభంలో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరీ 1116, అనుదీప్ కేవీ 516, సూర్యదేవర నాగవంశీ 116 చదవించారనే డైలాగ్‌లతో టీజర్ ప్రారంభమైంది. కట్ చేస్తే విష్ణు పెళ్లికి రెడీ అవుతుంటాడు. ఆమెకి స్వీట్ పెట్టి పేరు చెప్పాలని చెప్పగా, సోమ్ పాపిడి అని చెప్పడంతో ఈ నవ్వుల గోల స్టార్ట్ అయ్యింది. ముహూర్తానికి ఇంకా మూడు రోజులుంది. ఈ లోపు ఏ దృష్ట గ్రహాలు వస్తాయో ఏం చేస్తాయో అని చిన్న పిల్లోడు అనగా, ముగ్గురు క్రేజీ బాయ్స్ సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లిలో వారు చేసే రచ్చ వేరే లెవల్.
ఇక ఉన్నట్టుంది పెళ్లికి ముందు పార్టీ చేసుకునేందుకు గోవా వెళ్తారు. అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు. గోవా వచ్చిన విష్ణు ఫాదర్.. అమ్మాయిలతో తిరిగే అలవాట్లేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా ఇంకా ఏం లేవు అంకుల్ అని చెప్పడం, అనంతరం అక్కడ కూడా రచ్చ చేసి నవ్వులు పూయించారు. కాలేజీ ఎపిసోడ్, చివరికి ఫోన్ కాల్ సీన్ కూడా ఆద్యంతం నవ్వులు పూయించింది. టీజర్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హిలేరియస్‌గా ఉంది. నిజంగానే మ్యాడ్ స్వ్కేర్ అనిపించింది.
ఇందులో అనుదీప్ మరోసారి మెరిశారు. ఆయన తనదైన స్టయిల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే సత్యం రాజేష్ పాత్ర కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. తాను స్టయిల్ పడుతూ కనిపించి దొరికిపోయాడు. ఇలా సర్‌ప్రైజింగ్ పాత్రలతో మరింతగా అలరించే ప్రయత్నం చేశారు. చివర్లో ఓ విలన్‌ని చూపించి సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. టీజర్ నవ్వులు పూయిస్తుంది. ఇంకా చెప్పాలంటే పిచ్చెక్కించేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.
'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. `మ్యాడ్ స్క్వేర్ `ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.