మొబైల్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి బండారం... ఏం సమాధానం చెప్తాడో!

Published : May 30, 2021, 08:57 PM IST
మొబైల్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి బండారం... ఏం సమాధానం చెప్తాడో!

సారాంశం

పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాకి గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ అనేక విషయాలపై తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆలీ రాజమౌళి కాకుండా పరిశ్రమలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని అడుగగా.. ఆయన పూరి జగన్నాధ్ పేరు చెప్పారు.

ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే మన శత్రువులకు దొరికిపోతాం. ఎటువంటి పరిచయం లేకపోయినా సోషల్ మీడియా ఫాలోయర్స్, నెటిజెన్స్ అందరికీ శత్రువులే. ముఖ్యంగా సెలెబ్రిటీల పాలిట వీరు వాచింగ్ డాగ్స్. ఏమాత్రం పొరపాటు చేసినా పట్టేయడం, ట్రోల్ చేయడం చేసేస్తారు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన ఫోన్ ఓపెన్ గా చూపించి నెటిజెన్స్ దగ్గర బుక్ అయ్యాడు. 


పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాకి గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ అనేక విషయాలపై తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆలీ రాజమౌళి కాకుండా పరిశ్రమలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని అడుగగా.. ఆయన పూరి జగన్నాధ్ పేరు చెప్పారు. దానికి ప్రూఫ్ గా తన ఫోన్ వాల్ పేపర్ పై ఆయన ఫోటోనే ఉంటుంది అంటూ కెమెరాకు తన మొబైల్ చూపించారు. 


పూరి ఫోటో ఉన్న ఫోన్ వాల్ పేపర్ చూపే క్రమంలో ఆయన వాడుతున్న యాప్స్ సైతం వీడియోలో కనిపించాయి. విజయేంద్ర ప్రసాద్ ఏమేమి యాప్స్ వాడుతారని ఔత్సాహికులు పరిశీలించగా.. వాటిలో మూవీ పైరసీ యాప్ ప్లే ఇట్ ఉంది. దానితో అందరూ షాక్ అయ్యారు. పరిశ్రమకు చెందినవాడు, స్టార్ రైటర్, రాజమౌళి ఫాదర్ అయ్యుండి పైరసీ యాప్ వాడుతున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?