ప్రభాస్‌ హోం క్వారంటైన్‌.. కంగారులో `సలార్‌`, `ఆదిపురుష్‌` యూనిట్స్ ?

Published : Apr 22, 2021, 09:48 AM ISTUpdated : Apr 22, 2021, 09:50 AM IST
ప్రభాస్‌ హోం క్వారంటైన్‌.. కంగారులో `సలార్‌`, `ఆదిపురుష్‌` యూనిట్స్ ?

సారాంశం

ప్రభాస్‌ హోం క్వారంటైన్‌ అయ్యారు. ఆయన మేకప్‌ మేన్‌కి కరోనా సోకడంతో `రాధేశ్యామ్‌` స్టార్‌ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. `రాధేశ్యామ్‌` చిత్రీకరణలో భాగంగా యూనిట్‌కి కరోనా సోకింది. అందులో ప్రభాస్‌ పర్సనల్‌ మేకప్‌మేన్‌ కూడా ఉన్నారు.

ప్రభాస్‌ హోం క్వారంటైన్‌ అయ్యారు. ఆయన మేకప్‌ మేన్‌కి కరోనా సోకడంతో `రాధేశ్యామ్‌` స్టార్‌ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. `రాధేశ్యామ్‌` చిత్రీకరణలో భాగంగా యూనిట్‌కి కరోనా సోకింది. అందులో ప్రభాస్‌ పర్సనల్‌ మేకప్‌మేన్‌ కూడా ఉన్నారు. దీంతో సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్ర బృందంతోపాటు ప్రభాస్‌ కూడా హోం ఐసోలేషన్‌ అయినట్టు తెలుస్తుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతనే షూటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు షూటింగ్‌ ఆపేయాలని భావిస్తున్నారట. 

ఇదిలా ఉంటే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు కొంత ప్యాచ్‌ వర్క్ ఉందట. వీటిని కంప్లీట్‌ చేసుకుని పూర్తి స్థాయిలో `సలార్‌`, `ఆదిపురుష్‌`లపై ఫోకస్‌ పెట్టాలని భావించారు ప్రభాస్‌. కానీ ఇప్పుడు కరోనా వెంటాడటంతో ఈ ప్రభావం మిగిలిన రెండు సినిమాలపై కూడా పడింది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు కూడా ఆగిపోనున్నాయి. ఇదిలా ఉంటే `రాధేశ్యామ్‌` చిత్రాన్ని జులై 30న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ ప్రసీద. పాన్‌ ఇండియా చిత్రంగా ఇది విడుదల కాబోతుంది. 

మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చిత్రం చేస్తున్నారు ప్రభాస్‌. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌. హోంబలే ఫిల్మ్ నిర్మిస్తుంది. దీంతోపాటు రామాయణం ఆధారంగా `ఆదిపురుష్‌`ని హిందీ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్నారు. ఇందులో సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్‌ల్లో ప్రభాస్‌ ఏకకాలంలో పాల్గొనబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్
బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్