పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ఓటీటీ డేట్‌ ఫిక్స్.. జస్ట్ త్రీ డేస్‌..

Published : Apr 27, 2021, 04:19 PM IST
పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ఓటీటీ డేట్‌ ఫిక్స్.. జస్ట్ త్రీ డేస్‌..

సారాంశం

`వకీల్‌సాబ్‌` చిత్రం వచ్చే నెలలో ఇది ఓటీటీలో వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా అధికారికంగా ఇది ఓటీటీలో వచ్చే డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ఈ నెల 9న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా వందకోట్లకి పైగా కలెక్షన్లని రాబట్టింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. అయితే కరోనా కారణంగా చాలా వరకు థియేటర్లు బంద్‌ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమాని ఓటీటీలో తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. 

వచ్చే నెలలో ఇది ఓటీటీలో వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా అధికారికంగా ఇది ఓటీటీలో వచ్చే డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. ఈ నెల 30నే అమెజాన్‌ ప్రైమ్‌లో రాబోతుందని పేర్కొంది. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌` చిత్రానికిది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. మాతృకలో ప్రధాన అంశాన్ని మార్చకుండా, తెలుగుకి తగ్గట్టు పవన్‌ మార్క్ స్టయిల్,  కమర్షియల్‌ అంశాలు జోడించి తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకి బ్రహ్మారథం పడుతున్నారు. 

లాయర్లు గా పవన్‌, ప్రకాష్‌ రాజ్‌, బాధితులుగా నివేదా థామస్‌, అంజలి నటనలకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నేటి కాలంలో మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో చూపించిన అంశాలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు మరింతగా కనెక్ట్ అవుతున్నాయి. `మగువ మగువ .. `సాంగ్‌ సినిమా రేంజ్‌ని మార్చేసింది. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్
బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్