యువ హీరో శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రోచేవారెవరురా'. కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా లేదా రివ్యూలో చూద్దాం..
కథేంటి :
ఇంకా ఇంటర్ పూర్తి చేయకుండా ఆకతాయిల్లా తిరిగే ముగ్గురు స్నేహితులు విశాల్ (శ్రీవిష్ణు), విశాక్ (ప్రియదర్శి), ర్యాంబో( రాహుల్ రామకృష్ణ). వీళ్లు చదివే కాలేజిలోనే నివేద థామస్ కూడా జాయిన్ అవుతుంది. కాలేజీ ప్రిన్సిపాల్ కుమార్తె నివేదా థామస్. నివేదా కూడా శ్రీవిష్ణు గ్యాంగ్ తో స్నేహం చేయడం మొదలుపెడుతుంది. తనకున్న కొన్ని సమస్యల వల్ల నివేదా తన తండ్రికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో శ్రీవిష్ణు గ్యాంగ్ ఆమెకు సహాయపడతారు. అనుకోని సంఘటనలవల్ల వాళ్ళు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ సమస్యలు ఏంటి.. వాటి నుంచి శ్రీవిష్ణు గ్యాంగ్ ఎలా బయట పడింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
undefined
విశ్లేషణ :
శ్రీవిష్ణు, నివేదా థామస్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుంది. తమ పాత్రలకు తగ్గట్లుగా శ్రీవిష్ణు, నివేదా చాలా బాగా నటించారు. ఇక కామెడీని కూడా దర్శకుడు కథలోనే ఇన్వాల్వ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. ఇక సత్యదేవ్, నివేతా పేతురాజ్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది.
ఈ చిత్రంలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు ఈ చిత్రంలో ఎక్కువ పాత్రలని ఇన్వాల్వ్ చేయడం వల్ల సినిమా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ వల్ల కొంతమేరకు ఆ ఫీలింగ్ తగ్గింది. సినిమాలో కన్ఫ్యూజన్ తో కామెడీ జనరేట్ చేయాలని ప్రయత్నించారు. ఆ సన్నివేశాలు రొటీన్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అన్ని సన్నివేశాల్ని అందంగా తెరకెక్కించారు.వివేక్ సాగర్ అందించిన బ్యాగ్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణం విషయంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా:
మొత్తంగా బ్రోచేవారెవరురా చిత్రం కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ కామెడీ, థ్రిల్లింగ్ సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా కొంత స్లోగా సాగినప్పటికీ శ్రీవిష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేతా పేతురాజ్ తమ నటనతో మెప్పిస్తారు.
రేటింగ్ : 3/5