బాలీవుడ్ హీరోల ఆదాయానికి గండి కొట్టేస్తున్నారు!

By Prashanth MFirst Published Feb 6, 2019, 5:17 PM IST
Highlights

బాలీవుడ్ అంటే మొన్నటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక మృగరాజుగా చలామణి అయ్యేది. కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ కూడా 100 కోట్ల మార్కెట్ ను ఈజీగా దాటేస్తోంది. స్టార్ హీరోలు నార్త్ హీరోలకు ధీటుగా సత్తా చాటుతున్నారు. అయితే మన స్టార్ హీరోల రేంజ్ కారణంగా ఇప్పుడు బాలీవుడ్ హీరోల ఆదాయానికి గట్టిగానే గండిపడుతోంది. 

యాడ్స్ విషయంలో మన హీరోలు సౌత్ మొత్తాన్ని కవర్ చేసేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి స్టార్స్ నేషనల్ వైడ్ గా కలుపుకొని బ్రాండ్ అంబాసిడర్ గా గట్టిగా ఆదాయాన్ని అందుకునేవారు. కానీ ఇప్పుడు మన హీరోల రేంజ్ నేషనల్ వైడ్ గా పాపులర్ అవ్వడంతో సౌత్ మొత్తం టాలీవుడ్ హీరోలే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. 

సల్మాన్ ఫెమస్ యాడ్స్ ను సౌత్ లో మహేష్ - తారక్ (థమ్స్ అప్ - యాపి ఫీజ్ వంటి కంపెనీలకు) చేస్తున్నారు. అందువల్ల సల్మాన్ ఖాన్ కి కొంచెం ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక షారుక్ ఖాన్ యాడ్స్ కొన్ని అల్లు అర్జున్ లాగేసుకుంటున్నాడు. ఇప్పుడు విజయ దేవరకొండను కూడా కొన్ని నేషనల్ కంపెనీలు టార్గెట్ చేశాయి. రానా కూడా కొన్ని ఫెమస్ యాడ్స్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా టాలీవుడ్ హీరోలు వారి స్టైల్ లో ఆదాయాన్ని పెంచుకుంటూ నార్త్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.    

click me!