ప్రముఖ సినీ నటుడు అనుపమ్ శ్యామ్ మృతి

By telugu team  |  First Published Aug 9, 2021, 7:45 AM IST

ప్రముఖ సినీ నటుడు అనుపమ్ శ్యామ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. పలు చిత్రాల్లోనూ సీరియళ్లలోనూ నటించిన అనుపమ్ శ్యామ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో అస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు.


ముంబై: ప్రముఖ సినీ నటుడు అనుపమ్ శ్యామ్ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 63 ఏళ్లు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శరీరంలోని బహు అవయవాలు వైఫల్యంతో అనుపమ్ శ్యామ్ మరణించినట్లు మిత్రుడు యశ్ పాల్ శర్మ చెప్పారు. 

అనుపమ్ శ్యామ్ మన్ కీ అవాజ్ ప్రతిజ్ఢ వంటి పలు సీరియళ్లలో నటించాడుర స్లమ్ డాగ్ మిలియనీర్, బాండిట్ క్వీన్ తదితర సినిమాల్లో నటించారు.  అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం అనుపమ్ శ్యామ్ సబర్బన్ గోరేగావ్ లోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి చేయిదాటి పోయి ఆదివారం రాత్రి మరణించారు. 

Latest Videos

undefined

మూడు దశాబ్దాల పాటు సినీ రంగంలో పనిచేశారు. సత్య, దిల్ సే, లగాన్, హజారోన్ ఖ్వైషేన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ సీరియల్ లో ఆయన ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్ర పోషించారు. 2009లో ప్రారంభమైన ఆ సిరీయల్ సెకండ్ సీజన్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. 

నిరుడు కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు డయాలసిస్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరోసారి ఆస్పత్రిలో చేరి ఆదివారం కన్నుమూశారు.

click me!