ప్రకాశ్ రాజ్ ఓటమి... కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే...

By telugu teamFirst Published May 23, 2019, 3:20 PM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా.. బీజేపీ అభ్యర్థి మోహన్ చేతిలో ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. మొదటి రెండు రౌంట్లు కౌంటింగ్ జరిగేంతవరకు ఆయన కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. 

తన ప్రత్యర్థి అత్యధిక మెజార్టీతో దూసుకోతుండటంతో... తన ఓటమి ఖాయమని ప్రకాశ్ రాజ్ కి అర్థమైపోయింది. దీంతో ఆయన తన మద్దతుదారులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున రిజ్వాన్‌ అర్షద్‌, బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ పీసీ మోహన్‌ బరిలోకి దిగారు. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి తిరిగి విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌రెండో స్థానంలో నిలవగా ప్రకాశ్‌ రాజ్ మూడోస్థానంలో నిలిచారు.

దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!