ఆధిక్యంలో దూసుకుపోతున్న సుమలత

Published : May 23, 2019, 09:04 AM IST
ఆధిక్యంలో దూసుకుపోతున్న సుమలత

సారాంశం

మ్యాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత... ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. కాగా... మ్యాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత... ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కాగా... సీఎం కొడుకుని కాదని మాండ్య ప్రజలు సుమలతకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. 

దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు