వెనుకంజలో జయప్రద... అజంఖాన్ దే పైచేయి

By telugu teamFirst Published May 23, 2019, 9:36 AM IST
Highlights

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. కాగా... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద ఎన్నికల బరిలోకి దిగారు. అయితే... ఆమె ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. ఆమె శత్రువు అజంఖాన్ పై చేయిగా ఉన్నారు. అజంఖాన్... అధిక మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే... ఎన్నికల ప్రచారంలో.. జయప్రద, అజంఖాన్ లు వ్యక్తిగత దూషణలకు పాల్పడి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 

దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!