రెండు సీట్ల నుండి రెండోసారి అధికారంలోకి... ప్రజాస్వామ్యమిచ్చిన బలమే: మోదీ

By Arun Kumar PFirst Published May 23, 2019, 8:50 PM IST
Highlights

భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల స్థాయి నుండి  రెండోసారి అధికారాన్ని చేపట్టే  స్థాయికి  చేరిందంటే అది ప్రజాస్వామ్యం అందించిన  బలమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య  విలువలను కాపాడుతూ ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన రాజ్యాంగ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అండతోనే బిజెపి ఇక్కడివరకు రాగలిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. 
 

భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల స్థాయి నుండి  రెండోసారి అధికారాన్ని చేపట్టే  స్థాయికి  చేరిందంటే అది ప్రజాస్వామ్యం అందించిన  బలమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య  విలువలను కాపాడుతూ ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన రాజ్యాంగ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అండతోనే బిజెపి ఇక్కడివరకు రాగలిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. 

లోక్ సభ ఎన్నికల్లో  రెండోసారి ఘనవిజయం సాధించిన తర్వాత బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...ఈ రోజు మేఘరాజు కూడా పాల్గొనడానికే వచ్చినట్లుగా(వర్షం పడటాన్ని ఉద్దేశిస్తూ) చమత్కరించారు. 2019 లోనూతన భారత ఏర్పాటు కోసం లోక్ సభ ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. 

భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా ఈ ఎన్నికలు రికార్డు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. స్వాత్యంత్ర భారతంలో అత్యధిక ఓటింగ్ శాతంఈ ఎన్నికల్లోనే నమోదైనట్లు తెలిపారు. ఇంత ఎండలో కూడా ప్రజలు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వారికి ఎన్నికల పట్ల వున్న నిబద్దతను తెలియజేస్తుందని మోదీ  ప్రశంసించారు. ప్రపంచ దేశాలు మొత్తం భారతీయ ప్రజాస్వామ్య విలువలను గుర్తిస్తుందన్నారు. 

మహాభారత యుద్ద సమయంలో శ్రీకృష్ణుడు న్యాయంవైపు నిలబడినట్లే...ఓటర్లు ఈ ఎన్నికల్లో ఆయన రూపంలోనే మా వైపు నిలిచారని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలంతా భారత భశిష్యత్ కోసం ఓటేశారన్నారు.ఈ ఎన్నికలు పార్టీలు, అభ్యర్థులు, నాయకులు మధ్య కాదని...దేశ ప్రజల మధ్యే పోటీ  పడుతున్నారని  తెలిపారు.ఇది ప్రజల  విజయమని ... అందువల్లే ఎన్డీఏ ఈ విజయాన్ని ప్రజల పాదాలచెంత వుంచుతోందని మోదీ అన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన అందరికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచిన వారికి, పార్టీలకు అభినందనలు  తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలా కొత్తగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహకారం  అందిస్తుందని హామీ ఇచ్చారు. 

 ఏ పార్టీలో అయితే మేమున్నామో ఆ బిజెపి పార్టీలో మంచి మనసున్న కార్యకర్తలున్నారని మోదీ కొనియాడారు. నిస్వార్థంతో ప్రజాస్వామిక విధానంలో ఈ ఎన్నికలు జరగడానికి వారు తమ నాయకులకెంతో సహకరించాన్నారు.బిజెపి పార్టీ విశిష్టత ఏంటంటే రెండు సీట్ల స్ధాయి  నుండి రెండోసారి అధికారాన్ని చేపట్టేవరకు సాగించిన ప్రయాణమేనని  అన్నారు. ఇది మోదీ విజయమో, బిజెపి, ఎన్డీఏ కూటమి విజయమో కాదని... దేశ ప్రజల విజయమని తెలిపారు.  

ఇప్పుడు తమను వ్యతిరేకిస్తున్న పార్టీలన్ని ఒకప్పుడు సెక్యులరిజం పేరిట రాజకీయాలు చేసేవని...సెక్యులర్లంతా ఒక్కటవ్వండని నినాదాలిచ్చే వారని గుర్తుచేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీలన్ని సెక్యులరిజం ముసుగును వదిలి ఎన్నికల బరిలో దిగినట్లు పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు ఈ ఎన్నికలు ఓ మంచి గుణపాఠాన్ని నేర్పాయని మోదీ అభిప్రాయపడ్డారు.  

''ఈ ఎన్నికల్లో ఏమయ్యిందో అందరం వదిలేదాం... ఇప్పుడు ముందుకు చూదాం. దేశ హితం కోసం  ముందుకు వెళదాం. దేశం మనకు చాలా ఇచ్చింది. కాబట్టి మనం కూడా దేశానికి సేవ చేయడానికి సిద్దబవుదాం. దేశ ప్రజల సమక్షంలో చెబుతున్నా మీరు ఈ ఫకీర్ జోలే నింపారు(ఓట్లతో).  చాలా  ఆశలతో ఆ పని చేశారని నాకు తెలుసు. వాటన్నింటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తా'' అని మోదీ అన్నారు.  

 

click me!