కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

By telugu teamFirst Published May 23, 2019, 4:44 PM IST
Highlights

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా జేడీఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పరాజయం పాలయ్యారు.

తొలుత సుమలత కాంగ్రెస్ తరపు నుంచి ఈ ఎన్నికల బరిలో నిలవాలని అనుకున్నారు. అయితే... కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా నిఖిల్ గౌడకి సీటు కేటాయించారు. సుమలతను ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని సూచించారు. కాగా... ఆమెకు టికెట్ తాము ఇస్తామంటూ బీజేపీ ఆహ్వానించింది. కానీ ఆమె బీజేపీలో చేరడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ బీజేపీ తన మద్దతు సుమలతకు తెలియజేసింది.

కర్ణాటక సీఎం కుమారుడు కాబట్టి నిఖిల్ గెలవడం చాలా సులవు అని భావించారు అంతా. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. సుమలత 67వేల ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!