సీఎం కొడుకు పేరిట రూ.660కోట్ల ఆస్తులు

Published : Apr 10, 2019, 12:50 PM IST
సీఎం కొడుకు పేరిట రూ.660కోట్ల ఆస్తులు

సారాంశం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ పేరిట దాదాపు రూ.660కోట్ల ఆస్తులు ఉన్నాయి. నకుల్ నాథ్  మంగళవారం చింద్వారా లోక్ సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు  చేశారు. 


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ పేరిట దాదాపు రూ.660కోట్ల ఆస్తులు ఉన్నాయి. నకుల్ నాథ్  మంగళవారం చింద్వారా లోక్ సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు  చేశారు. కాగా.. నామినేషన్ తోపాటు సమర్పించిన అఫిడవిట్ లో తన పేరిట ఆస్తులు రూ.660కోట్లుగా పేర్కొన్నారు.

కాగా.. తన తల్లిదండ్రుల ఆస్తుల కన్నా.. నకుల్ నాథ్ ఆస్తులు ఐదురెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కమల్ నాథ్ పేరిట రూ.124కోట్లు ఆస్తులు ఉన్నాయి.  తొలుత వ్యాపారంలో రాణించిన నకుల్.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.615.93కోట్ల చర ఆస్తులు ఆయనకు ఉన్నాయి. వాటిలో ఆయన భార్య ప్రియ పేరిట రూ.2.30కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక ఆయన పేరిట రూ.41.77కోట్ల స్థిర ఆస్తి ఉన్నట్లు చెప్పారు. భార్య ప్రియ పేరిట ఎలాంటి స్థిర ఆస్తులు లేవని తెలిపారు. నకుల్, ఆయన భార్య ప్రియ పేరిట ఎలాంటి వాహనాలు లేవని చెప్పారు. 

నకుల్ పేరిట 896.669గ్రాముల బంగారం, 7.630కేజీల వెండి, 147.58క్యారెట్స్ డైమండ్, రూ.78.45లక్షల విలువచేసే స్టోన్ జ్యూవెలరీ ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక భార్య పేరిట రూ.270.322గ్రాముల బంగారం, 161.84క్యారెట్ల డైమండ్స్, రూ.57.62లక్షల విలువచేసే  స్టోన్స్ జ్యూవెలరీ ఉందని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు