మోడీ మళ్లీ గెలిస్తేనే బాగుంటుంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

By Siva KodatiFirst Published Apr 10, 2019, 12:15 PM IST
Highlights

తాజా ఎన్నికల్లో భారత ప్రధానిగా నరేంద్రమోడీ మరోసారి గెలవాలని ఆకాంక్షించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

తాజా ఎన్నికల్లో భారత ప్రధానిగా నరేంద్రమోడీ మరోసారి గెలవాలని ఆకాంక్షించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే శాంతి చర్చలకు ఆస్కారం ఉంటుందని... కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే శాంతి చర్చలు నిర్వహించేందుకు భయపడుతుందని ఆయన పేర్కొన్నట్లు ఓ జాతీయ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

బీజేపీ గెలిస్తే కశ్మీర్ అంశం ఓ కొలిక్కి వస్తుందని, కొన్ని సెటిల్‌మెంట్లు జరుగుతాయన్నారు.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరిణామాలను తానెప్పుడూ ఊహించలేదని ఇమ్రాన్ తెలిపారు. భారత్‌లో తనకు చాలా మంది ముస్లింలు తెలుసునని, వారు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ ఓ రాజకీయ అంశంమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాకిస్తాన్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడల్లా కశ్మీర్‌లు నష్టపోయారని, తోటి వారితో శాంతి సంబంధాలు కలిగి ఉండటం పాక్‌కు అవసరమన్నారు.

నరేంద్రమోడీ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. మోడీపై వ్యతిరేకత వ్యక్తమైతే.. భారత సైన్యం చేత పాక్‌పై దాడి చేయించే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

click me!