
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు తొలి దశలో 14నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. కాగా ఈ 14నియోజకవర్గాల్లో పోటీకి నిలిచిన అభ్యర్థులు.. పోలింగ్ తలుచుకొని తెగ భయపడుతున్నారు. ఇంతలా భయపడటానికి వరుస సెలవులే కారణం.
తొలి దశ పోలింగ్ ఈ నెల 18న జరుగనున్న సంగతి విదితమే. ఆ రోజు ఎలాగూ ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. 17న మహావీర్ జయంతి, 19న గుడ్‌ఫ్రైడే సెలవులు న్నాయి. 20న శనివారం, 21 ఆదివారం వారాంతపు సెలవులు. ఈ లెక్కన 16 రాత్రి బయల్దేరి వెళితే వరుసగా ఐదురోజుల పాటు సెలవులు లభిస్తాయి. ఈ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బ్యాంకు ఉ ద్యోగులు ఊటీ, షిర్డీ తదితర ప్రాంతాలకు లాంగ్‌టూర్‌లకు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇలా ఓటర్లంతా లాంగ్ టూర్లకు వెళితే.. ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని అభ్యర్థులు భయపడిపోతున్నారు. ఓటింగ్ శాతం తగ్గితే.. గెలుపోటముల విషయంలో తేడాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల డ్యూ టీలు ఉంటాయి కాబట్టి సెలవు తీసుకోవడం సాధ్యపడదు. ఈ సారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు యువ ఓటర్లు చెక్కేస్తే ఎలాగని ఆ యా పార్టీల అభ్యర్థులలో గుబు లు ప్రారంభమైంది. అందుకే ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ఈ విషయం ప్రస్తావించి మరీ ఓటర్లను అభ్యర్థించడం గమనార్హం. ఓటు వేశాక ఎక్కడికైనా వెళ్లండి అంటూ వేడుకోవడం విశేషం.