మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం

By telugu teamFirst Published May 30, 2019, 11:55 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోదీ... ఈ రోజు సాయంత్రం రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి.

ప్రధాని నరేంద్రమోదీ... ఈ రోజు సాయంత్రం రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి. ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఆహ్వానం పంపించారు. అయితే.... డీఎంకే అధినేత స్టాలిన్ కి మాత్రం ఆహ్వానం అందలేదు. 

తమిళనాడు రాష్ట్రంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న డీఎంకే పార్టీకి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం అందకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి టీఆర్ బాలు తెలిపారు. ఈ విషయంలో స్టాలిన్ బాగా అప్ సెట్ అయ్యారనే వాదనలు వినపడుతున్నాయి.

 బీజేపీ, కాంగ్రెస్ ల తర్వాత లోక్ సభలో  అత్యంత పెద్ద పార్టీ అయిన డీఎంకేని మోదీ పక్కన పెట్టడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. డీఎంకే అధినేతకు ఆహ్వానం రాలేదంటే... ఏకంగా తమిళనాడు రాష్ట్రాన్నే మోదీ పట్టించుకోనట్లే అని విమర్శలు వినపడుతున్నాయి. అయితే... ఆహ్వానం కేవలం స్టాలిన్ కి మాత్రమే అందలేదని... ఆ పార్టీ నేతలు కొందరికి అందినట్లు సమాచారం.

ఈ విషయంపై డీఎంకే నేతలు మట్లాడుతూ...తమ అధినేత ఆహ్వానం అందితేనే తాము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు. ఇదిలా ఉండగా... తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలువురు ఏఐఏడీఎంకే లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 
 

click me!