ఆమేథీలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్

Published : Apr 10, 2019, 10:34 AM IST
ఆమేథీలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నాడు ఆమేథీ ఎంపీ స్థానంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంకగాంధీ కూడ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

లక్నో: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నాడు ఆమేథీ ఎంపీ స్థానంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంకగాంధీ కూడ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కేరళలోని  వయనాడ్ ఎంపీ స్థానం నుండి కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి వారం రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. 

గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీలో మరోసారి  రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఈ దఫా రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ నుండి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  పోటీకి దిగుతున్నారు. రాహుల్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో  భారీ ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. 2014 ఎన్నికల్లో కూడ రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆమేథీ స్థానం నుండి రాహుల్ గాంధీ మూడు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.
 

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు