కుమారస్వామి మాజీ సీఎం అంట: బహిరంగసభలో నోరు జారిన సిద్ధూ

By Siva KodatiFirst Published Apr 9, 2019, 12:00 PM IST
Highlights

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తరచుగా నోరు జారుతూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. 

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తరచుగా నోరు జారుతూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. సోమవారం బెంగళూరు హోరోహళ్ళిలో కాంగ్రెస్-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థి కృష్ణభెరేగౌడ తరపున ఎన్నికల ప్రపచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... తాను ఇంకా అనేక చోట్ల ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉందని అందువల్ల తక్కువగా మాట్లాడుతానని, తరువాత మాజీ సీఎం కుమారస్వామి వస్తారని సిద్ధూ వ్యాఖ్యానించారు.

దీంతో జనంలోంచి కొందరు యువకులు ‘‘ మాజీ కాదు.. మాజీ కాదు’ అంటూ నినాదాలు చేశారు. తప్పు గుర్తించిన సిద్ధరామయ్య .. వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని తెలిపారు.

జేడీఎస్ అధినేత దేవేగౌడ బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేయాలని ఉండేదని.. అయితే తుమకూరు ప్రజల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా కృష్ణభైరేగౌడను సంకీర్ణ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు.

కేంద్ర మంత్రి సదానందగౌడ నిష్క్రియాపరుడని.. ఆయన ఎప్పుడైనా ముఖం చూపించారా..? ఆయనకు అంత శక్తి లేదని చురకలంటించారు. అందుకే ప్రధాని మోడీ ముఖం చూసి ఓటు వేయాలని చెబుతున్నారని సిద్దూ అన్నారు. గత వారం బీదర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని కావాలంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం కలకలం రేపింది. 

click me!