లోక్‌సభ ఎన్నికలు: నినాదానికి నినాదమే రిప్లై

By narsimha lodeFirst Published Mar 5, 2019, 4:57 PM IST
Highlights

ఎన్నికలు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. 


న్యూఢిల్లీ:  ఎన్నికలు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు ఆయా పార్టీల ఎన్నికల నినాదాలకు ప్రత్యర్ధులు కౌంటర్ నినాదాలు ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నినాదాల పోరు సాగుతోంది.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఆసక్తికరమైన నినాదాల యుద్ధం సాగుతోంది. దేశానికి తాను కాపలాదారుడిగా ప్రధానమంత్రి  మోడీ చెప్పుకొంటున్నాడు. తాను చౌకీదారునని ప్రతి సభలో మోడీ తన ప్రసంగంలో చెప్పేవాడు.

అయితే బీజేపీ ఎన్నికల నినాదానికి కాంగ్రెస్ పార్టీ కౌంటరిచ్చింది. చౌకీదారు చోర్ హై అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే రకమైన నినాదాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చీప్ రాహుల్ గాంధీ ఇదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసింది. రాఫెల్ డీల్‌ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.

మోడీ హై తో ముమ్కిన్  హై అంటూ బీజేపీ ప్రజల్లో ప్రచారాన్ని ప్రారంభించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మోడీ పై చేయి అంటూ బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ  కౌంటర్ ఇచ్చింది. చౌకీదార్ చోర్ నిఖ్‌లా క్యోంకీ నా ముమ్కిన్  అబ్ ముమ్కిన్ హై అంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కౌంటరిచ్చింది.

రాఫెల్ డీల్‌ను  లింక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కౌంటర్  ఇచ్చింది.  అర్హత లేకున్నా  అనిల్ అంబానీకి రాఫెల్ డీల్‌ను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ బీజేపీని కౌంటర్ చేసింది.
 

click me!